డీసీఎంను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 10 మందికి గాయాలు

డీసీఎంను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. 10 మందికి గాయాలు

MBNR: రాజాపూర్ మండల కేంద్ర సమీపంలో జాతీయ రహదారి 44పై ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న డీసీఎంను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో జడ్చర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.