'రజకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి'
MBNR: రజకుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రజక సంఘం జిల్లా అధ్యక్షులు దుర్గేష్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి తమకు సమావేశ భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. భవనం లేక తామంతా పట్టణంలోని ఏదో ఒక పార్కులో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.