'వైద్యులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి'
NDL: బండి ఆత్మకూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ బుధవారం తనిఖీ చేశారు. మందులు, ల్యాబ్‌టెస్ట్‌ల లభ్యతను, రిజిస్టర్లను పరిశీలించారు. వైద్యశాల నిర్వహణకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు అందించారు. వైద్యులు సమయపాలన పాటించి, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.