బొల్లవరం ఆలయ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

KDP: దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తెలిపారు. ఈ మేరకు స్థానిక బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గం ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ఇందులో భాగంగా దేవస్థానం ఛైర్మన్ సత్యనారాయణ రెడ్డి చేత ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి పాల్గొన్నారు.