యువకుడి అనుమానాస్పద మృతి
BDK: బూర్గంపాడు మండలం సారపాక-మణుగూరు క్రాస్ రోడ్డు సమీపంలో రెడ్డిపాలెం దారి వద్ద ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. రోడ్డు పక్కన మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది.