డ్రగ్స్ పట్టివేత నలుగురిపై కేసు నమోదు

NZB: నిషేధిత మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు బిక్కనూరు సిఐ సంపత్ కుమార్ తెలిపారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, కల్లులో కలిపే ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాలను కారులో రవాణా చేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో 248 గ్రాముల మత్తు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.