గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

గుంటూరు: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన శశి, అనిల్ కుమార్ అనే వ్యక్తులను ఆదివారం పెదకాకాని పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ విశాఖపట్నంలో అర్జున్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసి మంగళగిరి, ఉప్పలపాడు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని సీఐ నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి జైలుకి పంపించామని అన్నారు.