సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ పరార్

KDP: ప్రొద్దుటూరు సబ్ జైలు నుంచి రిమాండ్ ఖైదీ మహమ్మద్ రఫీ శనివారం ఉదయం గోడ దూకి తప్పించుకొని పరారైనట్లు తెలిసింది. ఈ ఖైదీని ఈనెల 13న రాజుపాలెం పోలీసులు అరెస్ట్ చేసి ప్రొద్దుటూరు సబ్ జైలుకు తరలించారు. ఇతను దువ్వూరు మండలం చెందిన వాడు. దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. పారిపోవడంతో పై అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.