చెరువులో పడి యువకుడు మృతి

ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామానికి చెందిన ఉయ్యాల శ్రీనివాసరావు(29) ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి బహిర్భూమికి అని ఇంటి సమీపంలో ఉన్న చిన్న చెరువు కట్టకి వెళ్ళి ప్రమాదవాశాత్తు చెరువులోకి జారి పడిపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. మృతుడు శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.