'కంపెనీల అనుమతులు రద్దు చేయాలి'
KMR: బిక్కనూర్ మండల పరిధిలో నూతనంగా మంజూరు చేసిన పరిశ్రమల అనుమతులను తక్షణమే రద్దు చేయాలని పెద్ద మల్లారెడ్డి సర్పంచ్ సాయ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం 'ప్రజావాణి'లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. పరిశ్రమల స్థాపనతో పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.