లారీలో ప్రయాణించిన ఎమ్మెల్యే

ADB: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు భారీ వాహనమైన లారీలో ప్రయాణించారు. బుధవారం జన్నారం మండలంలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద ఆయన భారీ వాహనాల రాకపోకలను ప్రారంభించారు. అనంతరం తపాలాపూర్ చెక్‌పోస్టు నుండి జన్నారం వరకు సుమారు 9 కిలోమీటర్ల వరకు ఆయన లారీలో ప్రయాణించారు. ఎమ్మెల్యే అయినప్పటికీ బొజ్జు లారీలో ప్రయాణించి ప్రజలను ఆశ్చర్యపరిచారు.