'అందరూ కలిసి డ్రగ్స్ రహిత జిల్లాను నిర్మిద్దాం'
NTR: జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ IAS, పోలీస్ కమీషనర్ ఎస్.వీ రాజశేఖర్ బాబు IPS, విజయవాడ మున్సిపల్ కమీషనర్ హెచ్.ఎమ్ ధ్యానచంద్ర IASతో కలిసి “డ్రగ్స్‌పై దండయాత్ర 2.0” కార్యక్రమాన్ని ప్రారంభించి, మత్తు పదార్థాల నిర్మూలనపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత రక్షణ, సమాజ ఆరోగ్యం కోసం అందరూ కలిసి డ్రగ్స్ రహిత జిల్లాను నిర్మించాలని వారు పిలుపునిచ్చారు.