పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం
CTR: పుంగనూరు విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. కంటి జబ్బులతో ఇబ్బంది పడుతున్న వారు శిబిరానికి వచ్చారు. దీంతో కంటి పరీక్షలు చేసి అవసరమైన 38 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. అనంతరం కంటి సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.