మంచినీరు వృధా చేస్తే.. వెంటనే ఫోటో తీసి కాల్ చేయండి.!
HYD: నగరంలో జలమండలి సరఫరా చేసే మంచినీటిని కార్లు, బైకులు కడగటానికి, రోడ్లు కడగటానికి ఉపయోగించడం, నిర్మిస్తున్న ఇండ్లకు క్యూరింగ్ చేయడం లాంటివి చేస్తే కఠినంగా వ్యవహరించి భారీ జరిమానా వేస్తామని జలమండలి హెచ్చరించింది. ఎవరైనా చూస్తే వెంటనే ఫోటో తీసుకొని, 155313, HMWSSB యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.