జిల్లాలో జోరు తగ్గిన బీఆర్ఎస్
KNR: గత పదేళ్లుగా జోరుమీద ఉన్న BRS ప్రస్తుతం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జోరు తగ్గింది. ఎన్నిక ఏదైనా గెలుపు BRSదే అన్నట్లుగా సాగిన పరిస్థితి నెలకొనగా అధికారం కోల్పోయిన రెండు సంవత్సరాలకు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చతికిల పడ్డ పరిస్థితి నెలకొంది. గతంలో గ్రామ గ్రామానికి BRS జెండాను ఎగురవేసిన పార్టీ ప్రస్తుతం స్పీడ్ తగ్గడంతో 2వ విడత ఎన్నికల్లో 99 సర్పంచ్ స్థానాలకే పరిమితమైంది.