VIDEO: నల్లబెల్లిలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం
WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలోగురువారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ జక్కి అనిత శ్రీకాంత్, బ్యాంక్ మేనేజర్ సౌజన్య హాజరై ప్రజలకు కేవైసీ వివరాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోకూడదని అవగాహన కల్పించారు.