జలమండలికి రూ.386 కోట్ల వ్యయంతో సోలార్ పవర్ ప్లాంట్లు

జలమండలికి రూ.386 కోట్ల వ్యయంతో సోలార్ పవర్ ప్లాంట్లు

HYD: జలమండలి ద్వారా HYD నగరానికి నీటి సరఫరా చేయాలంటే భారీ స్థాయిలో విద్యుత్ అవసరం ఉంటుంది. దీనిని తగ్గించేందుకు పంప్ హౌస్‌ల వద్ద సోలార్ పవర్ ఉత్పత్తికి జలమండలి సిద్ధమైంది. మొత్తం రూ.386 కోట్ల వ్యయంతో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా 5 వాటర్ పంప్ హౌస్‌లలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.