'ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుంది'

'ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుంది'

SRPT: ప్రజా సంపదను మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతుందని సీపీఎం పార్టీ రాష్ట్ర సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి నీళ్లు అందించి ఆదుకోవాలన్నారు.