గ్రామ సభల నిర్వహణకు ఎన్ని ఏర్పాట్లు
NRPT: ప్రజా పాలన 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో ఏప్రిల్ 2న గ్రామ సభలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 272 గ్రామ పంచాయతీలు ఉండగా సభలు నిర్వహణకు ఇప్పటికే గ్రామాలలో సర్పంచ్, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామసభల నిర్వహణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో విజయవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.