స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ

NZB: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాల పండుగ అని స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపల్ జ్యోతి అన్నారు. శుక్రవారం మారుతీ నగర్‌లో గల స్నేహ సొసైటీ ఆవరణలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఒడి బియ్యం, వస్త్రాలు, బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరారు.