వృద్ధురాలి మెడలో చైన్ స్నాచింగ్

CTR: పుంగనూరు పట్టణంలోని కట్టకిందపాల్యంలో ఓ వృద్ధు రాలి మెడలో ఉన్న 24 గ్రాముల బంగారు చైన్‌ను పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బుధవారం ఉదయం లాక్కెళ్లారు. వారు చేను లాగిన వేగానికి వృద్ధురాలు కింద పడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు.