ఈ నెల 15న మంత్రుల ఇళ్ల ముట్టడి

NZB: అంగన్వాడీల సమస్యలపై ఈ నెల 15న జరిగే మంత్రుల ఇళ్ల ముట్టడిని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కోరారు. గురువారం కార్యాలయంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. రోజురోజుకీ సమస్యలు పెరిగిపోతున్నాయని, కనీస వేతనాలు అమలుకావడం లేదన్నారు.