ఘనంగా మహాకవి జాషువా జయంతి వేడుకలు

ఘనంగా మహాకవి జాషువా జయంతి వేడుకలు

హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఆదివారం మహాకవి గుర్రం జాషువా జయంతి వేడుకలను కుల, వివక్ష పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య ప్రారంభించారు. జాషువా చిత్రపటానికి కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాషువా రచనల పుస్తకాలను కార్యకర్తలకు పంపిణీ చేశారు. జన్ను సాంబయ్య, రేఖ, రజిత తదితరులు పాల్గొన్నారు.