యూరియా లారీ మాయంపై ఏవో ఫిర్యాదు

NDL: మార్క్ ఫెడ్ కార్యాలయం నుంచి గోస్పాడు మండలం పసురుపాడుకు ఒక లారీ లోడ్ యూరియా గమ్యస్థానానికి చేరుకోలేదు. ఈ మేరకు యూరియా లారీ మాయం కావడంపై శుక్రవారం మండల వ్యవసాయ అధికారి స్వప్నిక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా, పసురుపాడుకు 266 బస్తాలు ఇండెంట్ పెట్టామని, రైతు సేవా కేంద్రానికి లారీ చేరుకోకపోవడంతో ఫిర్యాదు చేశామని ఏవో తెలిపారు.