రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

GNTR: మంగళగిరి మండలం చినకాకానిలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఎయిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. స్థానికుల కథనం ప్రకారం.. మృతుడు ప్రతిపాడు గ్రామానికి చెందిన జిలేబీ అమ్మే వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.