నేడు ఖమ్మంకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు రాక

KMM: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం ఖమ్మం జిల్లాకు రానున్నారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లోయలో పడి మృతి చెందిన కారేపల్లి మండలం సూర్యతండాకు చెందిన జవాన్ బానోత్ అనిల్ నాయక్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళి అర్పిస్తారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అనిల్ నాయక్ అంతిమ యాత్రలో పాల్గొంటారు.