'పరిశుభ్రతతో క్షయ వ్యాధి దూరం'

SKLM :పరిసరాల పరిశుభ్రత పాటిస్తే క్షయవ్యాధిని దూరం చేయవచ్చని నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.శాంతి హేమ్ అన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని గురువారం కళాశాలలో నిర్వహించారు. స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి పర్యవేక్షకులు వై.రాజు మాట్లాడుతూ.. క్షయవ్యాధిపై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి, అవగాహన పెంపొందించుకోవాలన్నారు.