తిరుమలలో భక్తులకు సౌకర్యాలు భేష్: మంత్రి

తిరుమలలో భక్తులకు సౌకర్యాలు  భేష్: మంత్రి

NLR: తిరుమలలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో భేటీ అయ్యారు. అనంతరం ఆయన తిరుమలలో సామాన్య భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన పాలకమండలిని అభినందించారు. తిరుమలలో సామాన్య భక్తులకు అందుతున్న సౌకర్యాలు భేష్ అని మంత్రి కొనియాడారు.