అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
SDPT: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం వాటిల్లిందని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రెక్కల శ్రీనివాసరెడ్డి ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో అప్పులు ఎలా తీర్చాలనే మనస్థాపంతో ఈనెల 13న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు గమనించి ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చెందాడు.