'విద్యుత్ సమస్యలు ఉండే సమాచారం ఇవ్వండి'

MDK: విద్యుత్ సమస్యలు ఉంటే అధికారులకు సమాచారం అందించాలని రామాయంపేట విద్యుత్ శాఖ ఏడీ ఆదయ్య సూచించారు. నార్సింగ్ మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల విద్యుత్ ప్రమాదాలకు ఎంతోమంది రైతులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. రైతుల తొందరపాటులో విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారని, విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని తెలిపారు.