రైలు ఢీకొని వృద్ధునికి తీవ్ర గాయాలు

కడప: కొండాపురం మండలం చౌటిపల్లె వద్ద వృద్ధునికి రైలు ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లాకు చెందిన గోపాల్(82) చౌటిపల్లె గ్రామం వద్ద ఆదివారం ఉదయం రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో కుడికాలు, ఎడమ చెయ్యి విరిగినట్లు సమాచారం. స్థానికులు 108 సమాచారం అందించారు.