రేషన్ బియ్యం.. ఆధార్ నెంబర్ ఉంటే సరిపోతుంది..!
MDCL: ఉప్పల్ పరిధిలోని గణేష్ నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, బీరప్ప గడ్డ పౌరసరఫరాల దుకాణాలలో రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతోంది. నూతన కార్డుదారులకు సైతం అందజేస్తున్నారు. ఆధార్ కార్డు నెంబర్ తీసుకుని రేషన్ దుకాణం వద్దకు వస్తే చెక్ చేస్తామని డీలర్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ నవంబర్ 15 వరకు రేషన్ సరుకులు తీసుకోవాలని సూచిస్తున్నారు.