బస్టాండ్‌లో డ్రైవర్ అన్నకు రాఖీ కట్టిన చెల్లి

MDK: రక్షాబంధన్ అంటేనే అన్నాచెల్లలు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి నిదర్శనం. మనసులో ప్రేమ ఆప్యాయత ఉండాలే కాని అది ఇళ్లయినా, బస్ స్టాప్ అయిన తేడా లేదని నిరూపించారు ఈ అన్నాచెల్లలు. కామారెడ్డి డిపో పరిధిలో RTC డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న నారాయణ అనే వ్యక్తికి రామాయంపేట బస్ స్టాప్‌కి వచ్చి రాఖీ కట్టింది చెల్లి శారద. వీరి ప్రేమను చూసిన స్థానికుల హృదయాలను హత్తుకుంది.