పెట్రోల్ కొరతపై సీపీఎం నిరసన
సిద్దిపేట జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు శిరీష విమర్శించారు. బుధవారం ఆర్టీసీ బంక్ వద్ద నిరసన తెలిపి అధికారుల ప్రకటనలపై మండిపడ్డారు. బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు కనిపిస్తుంటే, కొరత లేదని అధికారులు చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా తక్షణమే ఇంధన సరఫరాను క్రమబద్ధీకరణ చేయాలని కోరారు.