'ఇళ్లు ఖాళీగా ఉంచేటప్పుడు భద్రతా చర్యలు తప్పనిసరి'
అన్నమయ్య: వేసవి సెలవుల్లో ఇళ్లు ఖాళీగా ఉంచేటప్పుడు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. సోషల్ మీడియాలో పర్యటన వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని, చెరువులు, బావులు వంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.