'ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి'
KMM: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడు డాక్టర్ సీలం పాపారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మలిదశ ఉద్యమంలో ఉద్యమకారులే కీలకమని, రాష్ట్ర సాధన కోసం అనేక కేసులు ఎదుర్కొని జైలు జీవితాలు గడిపారని తెలిపారు. ఉద్యమకారుల వల్లే రాష్ట్రం వచ్చిందన్నారు.