నేడు ఈ ప్రాంతాలకు పవర్ కట్
ELR: పెదవేగి, లింగపాలెం మండలాల్లోని 132 కేవీ పెదవేగి సబ్ స్టేషన్ లో మరమ్మతుల నిమిత్తం, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏలూరు ఈఈ అంబేడ్కర్ తెలిపారు. కావున, మండలంలో ఉన్న సబ్ స్టేషన్లకు, 33 కేవీ లైన్లకు విద్యుత్ ఉండదని, ఆయా సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని తెలిపారు.