ఆగి ఉన్న బైక్‌ను ఢీకొన్న స్కూటీ

SKLM: పెదపాడు దగ్గరలో ఉన్న గాయత్రి కాలేజీ సమీపంలో స్కూటీ, బైక్ సోమవారం ఢీకొన్నాయి. పలాస నుంచి శ్రీకాకుళంకి బైక్‌పై వెళ్తున్న టి.ధర్మారావు అతని మేనల్లుడు దాహం వేయడంతో కాలేజ్ దగ్గర బ్రిడ్జి కింద ఆపి నీరు తాగుతున్నారు. ఆ సమయంలో నరసన్నపేట నుంచి శ్రీకాకుళం స్కూటీపై వెళ్తున్న వ్యక్తి బైక్‌ని వేగంగా ఢీకొన్నారు. స్కూటీపై వెళ్తున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయపడ్డారు.