12 నృసింహ దీక్షల విరమణ
VSP: సింహాచలంలో ఈ నెల 12న శ్రీ నృసింహ దీక్షల విరమణ కార్యక్రమం జరగనుంది. ఆ రోజు ఉదయం 6.30 గంటల నుంచి దీక్షాస్వాములు ప్రత్యేక క్యూలైన్ల ద్వారా శాంతి హోమాన్ని వీక్షించి, స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అనంతరం గోకులం వద్ద ఇరుముడి సమర్పించి దీక్ష విరమించాలి. భక్తుల కోసం ఉచిత రవాణా, వసతి అన్నప్రసాద సౌకర్యాలను దేవస్థానం ఏర్పాటు చేసింది.