VIDEO: మండలంలో భారీ వర్షం.. రైతన్నలు ఆనందం

VIDEO: మండలంలో భారీ వర్షం.. రైతన్నలు ఆనందం

కోనసీమ: అయినవిల్లి మండలంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్ననానికి ఒక్కసారిగా మేఘావృతమై భారీ వర్షం కురవడంతో ప్రయాణికులు, వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. సుమారు 4 నెలల తర్వాత వర్షం పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి తోటలకు ఈ వర్షం ఉపయోగపడుతుందని అంటున్నారు.