కలెక్టర్‌ను కలిసిన ఆర్డీవో గ్లోరియా
బాపట్ల: ఆర్డీవో గ్లోరియా రేపల్లె ఆర్డీవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. కొత్త బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఒక మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. తనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించినందుకు ఉన్నతాధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తానన్నారు.