అంగన్వాడీ ప్రారంభానికి ఎమ్మెల్యే రాక..!
KRNL: ప్యాపిలి మండలం నక్కవాగులపల్లిలో నూతన అంగన్వాడీ భవన ప్రారంభోత్సవానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఇవాళ హాజరవుతారని టీడీపీ నాయకులు తెలిపారు. అనంతరం ఉదయం 11 గంటలకు కౌలుపల్లిలో తాగునీటి పైప్‌లైన్ పనుల ప్రారంభంలో పాల్గొంటారని వెల్లడించారు. కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.