పెన్‌పహాడ్‌లో రోడ్డు భద్రతపై అవగాహన
SRPT: పెన్‌పహాడ్‌లో జాతీయ రోడ్డు ప్రమాదాల నివారణ మాసోత్సవాల్లో భాగంగా ఇన్‌ఛార్జ్ తహసీల్దార్ ధరావత్ లాలు నాయక్, ఎస్సై గోపికృష్ణ వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. వారు హెచ్చరిస్తూ.. ప్రతి వాహనదారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, వాహన పత్రాలు సిద్ధంగా ఉండాలన్నారు. డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ ఉపయోగించకూడదని సూచించారు.