వరి పంట కోతలను ప్రారంభించిన రైతులు

వరి పంట కోతలను ప్రారంభించిన రైతులు

కృష్ణా: నందివాడలో అల్పపీడనం ప్రభావంతో ఆదివారం రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో వచ్చిన తుఫాను కారణంగా కొంత పంట నష్టం జరగగా, రానున్న రోజుల్లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తమై, పండించిన వరి పంట కోతలను ప్రారంభించారు. ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.