'తుది విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి'
BDK: తుది విడత ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులకు ఆదేశించారు. సోమవారం జూలూరుపాడు, సుజత్ నగర్, లక్ష్మీదేవిపల్లి, ఇల్లందు, ఆళ్లపల్లి, గుండాల, టేకులపల్లి మండలాల్లో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లపై సూచనలు చేశారు.