రేషన్ షాపులు లైసెన్స్ తీసుకోవాల్సిందే: కేంద్రం

రేషన్ షాపులు లైసెన్స్ తీసుకోవాల్సిందే: కేంద్రం

ఫుడ్ సేఫ్టీ చట్టం-2006 ప్రకారం రేషన్ షాపులు ఆహార వ్యాపార కార్యకలాపాల పరిధిలోకే వస్తాయని, అర్హత ఆధారంగా ప్రతి షాప్ యజమాని రిజిస్ట్రేషన్ లేదా FSSAI లైసెన్స్ తీసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. వరంగల్ MP కడియం కావ్య లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి BL వర్మ పైవిధంగా బదులిచ్చారు. ఫుడ్ ఐటమ్స్ నాణ్యత, పరిశుభ్రతపై రాజీపడేది లేదన్నారు.