చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయలక్ష్మి (51) అనే మహిళ మృతి చెందింది. కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామానికి చెందిన విజయలక్ష్మి, తన భర్త వెంకటేశ్వర్లుతో కలిసి బైక్‌పై బుగ్గానపల్లె సుంకులమ్మ దేవి దర్శనానికి వెళ్తుండగా.. అదుపుతప్పి బైక్ బోల్తా పడటంతో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.