VIDEO: రెండో విడత జీపీ వార్డు సభ్యులకు శిక్షణ
SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో సోమవారం రెండో విడత గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని సిర్గాపూర్, వాసర్, వంగ్దల్, ఉజలంపాడు, సూర్త్యా తండా తదితర జీపీలకు సంబంధించి వార్డు సభ్యులు హాజరయ్యారు. జీపీ పరిపాలన విభాగంలో వార్డు సభ్యులకు పాత్ర, చేయాల్సిన కార్యచరణపై ట్రైనర్ అవగాహన కల్పించారు.