రహదారిని ప్రారంభించిన మంత్రి
ఏలూరు జిల్లాలో నూతనంగా నిర్మించిన పెదపాడు - వట్లూరు రహదారిని గురువారం హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ రహదారి అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడటంతో పాటు, రవాణా ఇబ్బందులు తొలగిపోనున్నాయని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.