అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు
KDP: తొండూరు మండలం యాదవారిపల్లెకు చెందిన చెన్నారెడ్డి మంగళవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పంట సాగు కోసం చేసిన అప్పులకు తగిన ఆదాయం రాకపోవడంతో పెట్టుబడులు ఎక్కువ కావడం వల్ల అప్పులవారి వేధింపులను తట్టుకోలేకనే ఈ దారుణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.